YS Sharmila: ఖమ్మం పర్యటనలో అస్వస్థతకు గురైన వైఎస్ షర్మిల - Videos of YS Sharmila
YS Sharmi fell ill during: ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జిలాల్లోని తుమ్మలపల్లిలో మొక్కజొన్న రైతులను పరామర్శించిన షర్మిల.. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తలు ఆమెకు ప్రథమ చికిత్స చేయగా కాసేపటికి తేరుకొన్నారు. వరుస పర్యటనలతో బీజీగా ఉన్న షర్మిల ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు కార్యకర్తలు తెలిపారు.
అంతకు ముందు నేలకొండపల్లి మండలం ముటాపురం గ్రామంలో జరుగుతున్న శ్రీ వీరన్న స్వామి జాతరలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆమెకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. నిన్న జనగాం జిల్లా పర్యటనకు వెళ్లిన షర్మిల అక్కడ మామిడి, వరి రైతులను పరామర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.