తెలంగాణ

telangana

Youth Stunts On Bike And bursting firecrackers Viral Video

ETV Bharat / videos

బైక్​లపై క్రాకర్స్ పేల్చుతూ యువత స్టంట్స్- లైవ్ వీడియో చూశారా?​​ - బైకర్స్ స్టంట్స్ తిరుచ్చి

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 6:31 PM IST

Youth Stunts On Bike And bursting firecrackers Viral Video : తమిళనాడులోని తిరుచ్చిలో క్రాకర్స్ పేల్చుతూ బైక్​లపై స్టంట్స్ చేశారు యువకులు. బైక్​లను వేగంగా నడుపుతూ దానిపై నుంచే బాణసంచాను ఇష్టానుసారంగా కాల్చారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బైక్​పై ఇష్టారాజ్యంగా క్రాకర్స్ పేల్చుతూ యువత హల్​చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరడం వల్ల 10 మంది యువకులపై కేసు నమోదు చేశారు.

వీడియోలో ఓ యువకుడు బైక్​ ముందు భాగంలో క్రాకర్స్​ పెట్టి పేల్చాడు. మరో యువకుడు ఈ స్టంట్స్ వీడియో​ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన తిరుచ్చి నగర శివారులో చెన్నై జాతీయ రహదారిపై యువకులు బైక్​లపై స్టంట్స్​ చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కల్లంగాడ్​కు చెందిన అజయ్​(21), తంజావూరుకు చెందిన మణికందన్​ను అరెస్ట్ చేశారు. వీరిద్దర్ని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు. బైక్​పై స్టంట్స్ చేసిన మిగతావారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details