తెలంగాణ

telangana

Youth Role in Telangana Assembly Elections 2023

ETV Bharat / videos

Pratidwani : తెలంగాణ ఎన్నికల్లో యువత పయనం ఎవరి వైపు..? - తెలంగాణ ఎన్నికల్లో యువత ప్రాధాన్యత

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 9:31 PM IST

Youth Role in Telangana Assembly Elections 2023 : యువత.. దేశ భవిష్యత్‌నే కాదు.. ఎన్నికల్లో.. నేతల తలరాతలు మార్చగలిగేది. రాష్ట్రానికి సంబంధించి.. ఎన్నికల సంఘం ప్రకటించిన తుదిజాబితానే తీసుకుంటే.. 3కోట్ల 17 లక్షల ఓటర్లలో కోటి 60 లక్షల ఓట్లు యువతవే. ఈసారి ఎన్నికల్లో యువతే ముఖ్య భూమిక పోషిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే యువతను ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కడుతున్నారు నాయకులు. పార్టీలు హామీల మీద హామీలు కురిపిస్తున్నాయి. 

అయితే.. యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థుల తలరాల్ని నిర్ణయించబోయేది యువతే అంటున్నాయి గణాంకాలు. పార్టీలు గానీ, యువత గానీ, ఆ ప్రాధాన్యత గుర్తిస్తున్నారా? రాష్ట్రవ్యాప్తంగా యువతే డిసైండింగ్‌ ఫ్యాక్టర్‌ అన్నది ఇక్కడ సుస్పష్టం. అయితే ఆయా రాజకీయ పక్షాల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించడంలో ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉంటే మేలు? పార్టీల వ్యూహాలు వారి ఆశలు, ఆకాంక్షల్ని ఏ మేరకు అందుకుంటున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details