తెలంగాణ ఎన్నికల్లో యువత ఓటే కీలకం - యువత తెలంగాణ ఎన్నికలు పై తొలి నిర్ణయం
Published : Nov 10, 2023, 8:07 AM IST
Youth opinion on Telangana Assembly Elections : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జోరు కనిపిస్తోంది. అభ్యర్థులు, పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఈ తరుణంలో ఈసారి తెలంగాణలో 25 లక్షల మంది కొత్తగా ఓటుహక్కు పొందారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న యువత ఓటు హక్కుపై చైతన్యంతో ఉన్నారు. నిజాయితీ గల అభ్యర్థి, ఆయా పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫెస్టోలు, ఐదేళ్లలో చేసిన అభివృద్ధి.. వచ్చే పదవీ కాలంలో చేయబోయే పనులేంటి..? ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటేస్తామని ధీమాగా చెబుతున్నారు. తమ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటును వేస్తామని..ఓటు అస్త్రంగానే కాకుండా తమ బాగోగులు మార్చే హక్కును బాధ్యతాయుతంగా వేస్తామంటున్నారు.
పార్టీలు ప్రకటించే ఉచితాలు, ప్రలోభాలకు లొంగకుండా లొంగకుండా ఉండాలని సూచిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో ఆధారంగా గతంలో అ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పరిగణనలోకి తీసుకొని ఓటు వేస్తామని చెబుతున్నారు. ఓటు అనేది స్వార్థంతో కాకుండా ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేసే వారికి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి చేసే అభ్యర్థులకే పట్టం కట్టాలంటున్న యువతతో ఈటీవీ భారత్ ముఖాముఖి.