వండర్ బైక్ 250- రూ.8 ఖర్చుతో 30కి.మీ జర్నీ! - అసోం విద్యార్థి ఈ బైక్ తయారీ
Published : Dec 9, 2023, 3:49 PM IST
Youth Made e Bike At Home : అసోం తేజ్‌పుర్‌కు చెందిన మస్కుల్ ఖాన్ అనే విద్యార్థి వినూత్న ఈ-బైక్‌ను రూపొందించాడు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశాడు. దీనికి 'వండర్ బైక్ 250' అని పేరు పెట్టాడు. తన సృజనాత్మకతతో ఈ బైక్ రూపొందించి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు.
రూ.8 ఖర్చుతో 30 కిలోమీటర్ల ప్రయాణం!
ఈ స్పెషల్ బైక్ కేవలం 8 రూపాయల ఖర్చుతో సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 30 కిలోల బరువున్న ఈ బైక్, సుమారు 80-100 కిలోల బరువును మోయగలదు. ఐదు గంటల్లోనే ఈ బైక్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.
కరోనా కాలంలో ఇంట్లో ఉంటూ ఈ సైకిల్
కరోనా ఉద్ధృతి సమయంలో ఇంట్లోనే ఉన్న మస్కుల్ ఖాన్.. ఈ-సైకిల్‌ను తయారు చేశాడు. ఆ తర్వాత అదే స్ఫూర్తితో ఈ-బైక్‌ను రూపొందించాడు. భవిష్యత్తులో ఈ-కార్‌ను సైతం రూపొందిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడీ కుర్రాడు. ఈ ప్రయాణంలో తన తండ్రి ఎల్లప్పుడూ అండగా ఉన్నాడని తెలిపాడు.