తెలంగాణ

telangana

ETV Bharat / videos

ట్రైన్​పైకి ఎక్కిన యువకుడికి కరెంట్ షాక్ - ఛత్తీస్​గఢ్ ఎక్స్​ప్రెస్​ వీడియో

By

Published : Oct 26, 2022, 6:34 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

ఛత్తీస్​గఢ్​లో ఓ యువకుడి దుస్సాహసం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో దుర్గ్​ రైల్వే స్టేషన్​లో ఉన్న ఛత్తీస్​గఢ్​ ఎక్స్​ప్రెస్​ పైకి అతడు ఎక్కాడు. చుట్టుపక్కల ఉన్నవారు, రైల్వే పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పైన నిల్చున్నాడు. అతడ్ని కిందకు దించేలోపే హైటెన్షన్ విద్యుత్​ వైర్​ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని జీఆర్‌పీ పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా మారడం వల్ల వైద్యులు రాయ్‌పుర్‌కు పంపారు. ఆ యువకుడ్ని.. జాంజ్​గిర్ ప్రాంతానికి చెందిన రవిగా గుర్తించారు. క్షతగాత్రుడు పంజాబ్​లో కూలీగా పని చేసేవాడని, దీపావళికి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details