చెప్పులతో బెదిరిస్తూ ఆకతాయి చేష్టలు- కోపంతో ఎదురుతిరిగిన గజరాజు- తర్వాత? - యువకులపై విరుచుకుపడ్డ ఏనుగు
Published : Dec 7, 2023, 12:43 PM IST
Youth Confront Elephant With Sandals : అసోంలోని జోర్హాట్లో ఏనుగుతో ఇద్దరు యువకులు ఆకతాయి చేష్టలకు పాల్పడ్డారు. ఏనుగును చెప్పులు చూపిస్తూ బెదిరించేందుకు యత్నించారు. వెనక్కి తగ్గినట్లే తగ్గి యువకులపైకి ఎదురుతిరిగింది గజరాజు. వెంటనే యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. యువకులు ఏనుగును చెప్పులు చూపిస్తూ బెదిరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వీడియోలో ఏముందంటే?
జోర్హాట్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగును ఇద్దరు యువకులు చెప్పులతో బెదిరించి వెనక్కి పంపారు. ఏనుగును చూసి భయపడకుండా పిడికిలి చూపిస్తూ ఓ యువకుడు ముందుకు సాగాడు. అప్పుడు ఏనుగు వారిపై కోపంతో ఎదురుతిరిగింది. వెంటనే యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పర్యటకులను హడలెత్తించిన ఏనుగు
wild Elephant Attack On Tourists In UP Viral Video : ఉత్తర్‌ప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వ్ సందర్శనకు వెళ్లిన పర్యటకులను ఇటీవల ఓ ఏనుగు వెంబడించింది. ఆ సమయంలో కొంతమంది పర్యటకులు సఫారీ కారులో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్, టూరిస్ట్ గైడ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియోను చూసేందుకు లింక్‌పై క్లిక్ చెయ్యండి.