Young Persons Dead in Pond Near Kowkur Dargah : చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి.. మృతదేహం కోసం గాలింపు చర్యలు - Secunderabad Latest News
Published : Oct 12, 2023, 3:50 PM IST
Young Persons Dead in Pond Near Kowkur Dargah :సికింద్రాబాద్ కౌకూర్ దర్గా వద్ద పండుగ నిమిత్తం వచ్చి చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం కౌకూర్ దర్గాలో గంధం పండుగ సందర్భంగా లంగర్ హౌస్ నుంచి వచ్చిన పర్వీజ్ (15), నాంపల్లి నుంచి వచ్చిన సలీం (32).. ఇరువురు ఉదయాన్నే స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈత కొడుతూ చెరువులోకి దిగిన ఇద్దరు యువకులకు.. ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సలీం మృతదేహాన్ని వెలికి తీశారు. పర్వీజ్ మృతదేహం లభించకపోవడంతో గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది బోట్ల సహాయంతో గాలింపు ముమ్మరం చేశారు. యువకుల మరణంతో ఒక్కసారిగా పండుగ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు యువకులు మృతి చెందిన విషయాన్ని తెలియచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.