బైక్పై స్టంట్లు చేస్తున్న యువకుడు
ప్రేయసితో కలిసి బైక్పై విన్యాసాలు.. స్టంట్స్ చేస్తూ ప్రియురాలికి ప్రపోజ్ - ప్రియురాలితో బైక్పై హల్చల్
మధ్యప్రదేశ్ ఛింద్వాడాలో ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్పై హల్చల్ చేశాడు. ప్రేయసిని బైక్ ముందు కూర్చొబెట్టుకుని స్టంట్స్ చేశాడు. అక్కడితో కాకుండా ప్రియురాలికి బైక్పై ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఛింద్వాడా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన బైకర్పై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించి త్వరలో అతడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.