రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ జారిపడ్డ వ్యక్తి.. బ్యాగుతో సహా లాక్కెళ్లిన రైలు.. చివరకు.. - man slips from moving train
రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నాడు ఓ ప్రయాణికుడు. అయితే, త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బిహార్, పట్నాలోని మకోమా రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. యూపీలోని వారణాసికి చెందిన జస్పాల్ సింగ్ అనే వ్యక్తి.. బిహార్‌లోని బెగుసరాయ్‌కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో పట్నాలోని మకోమా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఇక్కడ రైలు ఎక్కుతుండగా కాలు జారాడు. ప్లాట్‌ఫాం, రైలు పట్టాలకు మధ్యలో పడిపోయాడు. ఈ క్రమంలో జస్పాల్‌ను బ్యాగ్‌తో సహా ట్రైన్ కొంతదూరం లాక్కెళ్లింది. దీన్ని గమనించిన రైల్వే పోలీసులు, ఇతర ప్రయాణికులు.. జస్పాల్‌ను కాపాడేందుకు ముందుకు వచ్చారు. చాకచక్యంగా వ్యవహరించి అతడిని రక్షించారు. ఇదంతా స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST