తెలంగాణ

telangana

Clash Between Both Parties

ETV Bharat / videos

Viral Video : మద్యం మత్తులో మహిళపై యువకుడి దాడి.. కట్ చేస్తే.. - సంతోశ్​నగర్​లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

By

Published : Apr 24, 2023, 11:51 AM IST

Clash Between Both Parties in Santoshnagar: హైదరాబాద్ పాతబస్తీ సంతోష్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుంధతీ కాలనీలో మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై దాడి చేశాడు. గమనించిన బస్తీ వాసులు ఎందుకు కొడుతున్నావ్ అని అడగగా వారిపైనా దాడికి తెగబడ్డాడు. అప్రమత్తమైన యువకులు వెంటనే అతడిని పట్టుకుని చితకబాదారు. మద్యం మత్తులో ఉన్న యువకుడు తన కుటుంబంతో ఈ విషయాన్ని చెప్పగా.. వారి కుటుంబ సభ్యులు బస్తీ వాసులతో గొడవకు దిగారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.  

ఇరువర్గాల వారు కర్రలతో ఒక్కసారిగా దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీలు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details