బీఆర్ఎస్, కాంగ్రెస్ అజెండా ఒక్కటే - వ్యక్తిగత అభివృద్ధి కోసం కృషి చేస్తారు : యోగి ఆదిత్యనాథ్ - వేములవాడలో యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభ
Published : Nov 25, 2023, 5:11 PM IST
Yogi Adityanath Public Meeting in Vemulawada : బీఆర్ఎస్, కాంగ్రెస్ అజెండా ఒక్కటేనని.. వ్యక్తిగత అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సిర్పూర్ బహిరంగ సభ అనంతరం.. వేములవాడలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఎన్నో ఆంక్షలతో తెలంగాణ ఆవిర్భవించిందని పేర్కొన్న యోగి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ మోసం చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో ముస్లింలకు.. అడ్డగోలుగా రిజర్వేషన్లు కల్పించి దిగుజారుడు రాజకీయాలు చేస్తున్నారని యోగి నిట్టూర్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ఏ ప్రాతిపదిక మీద రాష్ట్రం ఏర్పాటు జరిగిందో.. ఆ ఫలాలను బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని యోగి విమర్శించారు. అదేవిధంగా ఎంఐఎంకు భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.