MLA Haripriya Yellandu Visit Video : కూలీలతో వరినాట్లు వేసిన ఎమ్మెల్యే హరిప్రియ.. వీడియో వైరల్ - yellandu MLA Haripriya
MLA Haripriya with farmers : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ.. ధర్మారం తండాలో సందడి చేశారు. అనంతరం రైతులతో కలిసి నాట్లు వేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిందని పేర్కొన్నారు. ఇల్లందు మండలం ముత్తారపుకట్ట పంచాయతీ శాంతినగర్ గ్రామానికి చెందిన.. 70 కుటుంబాలు ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. దశాబ్దాలుగా పోడు భూముల పట్టాల కోసం నిరీక్షించిన ఈ ప్రాంత వాసులకు.. సీఎం కేసీఆర్ చేసిన కృషితో భూములకు హక్కు పత్రాలు దక్కడంతో ఆనందంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో విభిన్న వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇల్లందు మండలంలోని మాణిక్యరం నుంచి కోటగడ్డ వరకు వేసిన రహదారితో.. ఈ ప్రాంతంలో నాలుగైదు గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయం మెరుగైందని తెలిపారు. త్వరలో గ్రామాలకు అంతర్గత రహదారులు కూడా రానున్నాయని తెలిపారు.