తెలంగాణ

telangana

Yashaswini Reddy Pajapalana Programme In Warangal

ETV Bharat / videos

ప్రజాపాలన కార్యక్రమంలో గలాటా - ఎంపీపీ, ప్రజల మధ్య వాగ్వాదం - Warangal news

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 5:08 PM IST

Yashaswini Reddy Pajapalana Programme In Warangal : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండాలో ప్రజా పాలన కార్యక్రమంలో గలాటా చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి హాజరు అయ్యారు. కార్యక్రమంలో యశ్వసిని రెడ్డి మాట్లాడుతూ అర్హులైనా వారందరూ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారెంటీల అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రకారమే ప్రజా పాలన తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిమి రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కార్యక్రమంలో అన్నారు.  

Pajapalana Programme In Warangal : దీంతో సభకు హాజరైనా ప్రజలు మాజీ మంత్రి ప్రస్తావన తీయడంతో వివాదానికి దారి తీసింది. ఎర్రబెల్లి విషయం ఎలా తెస్తారని కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన కార్యక్రమం గురించి చెప్పాలని అక్కడున్న వారంతా గొడవ చేశారు. దీంతో సభలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details