తెలంగాణ

telangana

Malladi Krishna Rao Help to Barrelakka

ETV Bharat / videos

బర్రెలక్కకు ఫాలోయింగ్​ మాములుగా లేదుగా- మద్దతు తెలిపిన యానాం ప్రజలు - బర్రెలక్కకు ఆరు లక్షలు అందజేసిన యానం ప్రజలు

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 4:21 PM IST

Yanam People Help to Barrelakka : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శిరీష అలియాస్ బర్రెలక్క(Barrelakka)కు విశేష స్పందన లభిస్తోంది. నిరుద్యోగ యువత సమస్యలే ప్రధాన ఎజెండాగా చేసుకుని ప్రచారం చేస్తోంది. గెలుపు, ఓటములు ఎలా ఉన్నా ఆమె చూపిన తెగువను గుర్తించిన అనేక మంది స్వచ్ఛందంగా వివిధ రూపాల్లో ఆమెకు సాయం చేస్తున్నారు.
Malladi Krishna Rao Support to Barrelakka : బర్రెలక్క అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన పుదుచ్చేరి రాష్ట్ర ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు(Malladi Krishna Rao) ఆమెకు మద్దతు పలికారు. తన వంతుగా ఆమెకు రూ.లక్ష, యానాం ప్రజలు, ప్రముఖుల నుంచి సేకరించిన ఐదున్నర లక్షలను స్థానిక నాయకులతో కలిసి కొల్లాపూర్ వచ్చి ఆమెకు అందజేశారు. రాజకీయాల్లోకి మరెందరో ధైర్యవంతులైన యువత ముందుకు వచ్చేందుకు బర్రెలక్క ఆదర్శంగా నిలిచిందని మల్లాడి కృష్ణారావు అభినందించారు. ఇలానే యువత రాజకీయాల్లో నిలవాలని ఆశించే ఈ సహాయం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల తర్వాత ఆమె చదువు కొనసాగించేందుకు.. ఇప్పుడు ఇచ్చిన నగదును ఉపయోగించుకోవాలని.. ఉన్నత చదువులకయ్యే ఖర్చులను కూడా తాను భరిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details