యాదాద్రి ఆలయానికి మరో ఘనత రూ.5.40 కోట్లలో విమాన గోపురానికి రాగి తొడుగు - యాదాద్రిలో విమాన గోపురానికి రాగి తొడుగు ఖర్చు
Published : Dec 5, 2023, 3:13 PM IST
Yadadri Vimana Gopuram Works Complete: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి రాగి తొడుగులతో తీర్చిదిద్దే పనులు పూర్తి చేశామని ఆలయ ఈవో గీత తెలిపారు. సంపూర్ణంగా కృష్ణశిలతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించి, గర్బాలయంపై 45 అడుగుల ఎత్తులోని దివ్య విమానాన్ని స్వర్ణమయం చేయాలన్నదే వైటీడీఏ అభిప్రాయమని అన్నారు. ఈ మేరకు ఆలయ పనులలో భాగంగా మొదటిగా రాగి కవచాలను తొడిగామని(Yadadri Vimana Gopuram copper sheath) చెప్పారు. 10,680 కిలోల రాగితో ఈ కవచాలను తయారు చేసినట్లు ఆలయ ఈఓ పేర్కొన్నారు.
Yadadri Temple Vimana Gopuram Expenditure: విమాన గోపురం చుట్టూ 9 వేల కిలోల విగ్రహాలకు 1680 కిలోల రాగి పట్టిందని ఆలయ ఈఓ అన్నారు. దాతల ద్వారా సేకరించిన విరాళాలతో స్వర్ణ మయం చేసి, ముందస్తుగా పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ తొడుగు పనులకు రూ.5.40 కోట్లు ఖర్చయిందని వెల్లడించారు. ఈ పనులు పూర్తి అయినందున ఆ గోపురం చుట్టూ ఉన్న పరంజాను తొలగించామని చెప్పారు. స్వర్ణ తాపడం పనులు ప్రభుత్వ సూచనలతో చేపడతామని ప్రకటించారు.