Yadadri Temple Pattern With Chalk Pieces : సుద్దముక్కలతో యాదాద్రి ఆలయ నమూనా.. భళేగా ఉంది కదా.. - Today Telangana News
Published : Oct 20, 2023, 10:42 PM IST
Yadadri Temple Pattern With Chalk Pieces : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నమూనాను ఓ కళాకారుడు వినూత్నంగా సుద్ద ముక్కలతో ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. హైదరాబాద్‌కు చెందిన సూరం సంపత్ కుమార్.. స్వామి వారి ఆలయ నమూనాను సుమారు మూడు మాసాలు వ్యవధిలో 8000 చాక్ పీసులను వినియోగించి తయారు చేశాడు. తనకు ఎంతో ఇష్టమైన ఆర్కిటెక్చర్ విభాగంలో విధ్యను అభ్యసిస్తూనే.. యాదగిరిగుట్ట దేవాలయానికి సంబంధించిన అన్ని విషయాలను సంపత్ తెలుసుకున్నాడు.
Yadadri Temple Art With Chalk Pieces : పంచతల రాజగోపురం, త్రితల రాజగోపురం, సప్తతల రాజగోపురం.. మొదలగు గోపురాలను తన చేతులతో రూపం పోశాడు. అంతేకాక కాకతీయుల విజయతోరణం, ఉత్తర దక్షిణ ద్వారాలు, సాలహారాలు వంటి అపురూప ఆకృతులకు అతడు ప్రాణం పోశాడు. ఆలయ నమూనా సిద్ధమవ్వటంతో ఇవాళ కార్యనిర్వహణాధికారికి అందజేశారు. సూరం సంపత్‌ను ఆలయ ఈవో అభినందించి శాలువాతో సత్కరించారు.