తెలంగాణ

telangana

Yadadri Temple Kalasam Broken

ETV Bharat / videos

Yadadri Temple Kalasam Broken : యాదాద్రిలో విరిగిన దక్షిణ రాజగోపుర కలశం.. కోతులే కారణం..! - యాదాద్రి ఆలయంలో విరిగిన గోపుర కలశం

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 6:47 PM IST

Yadadri Temple Kalasam Broken : తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం పునర్నిర్మాణం చేసి భక్తులకు దర్శనాలకు అనుమతించిన విషయం తెలిసిందే. ఆలయపు నిర్మాణం జరిపి ఏడాదిన్నర పూర్తి కావస్తుంది. ప్రధాన ఆలయం చుట్టూ నలువైపులా ఐదు అంతస్తుల పంచతల రాజగోపురాల నిర్మాణం చేశారు. అయితే అనూహ్యంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న దక్షిణవైపు గల రాజ గోపురంలోని కలశాలలో ఒక కలశం కోతుల ధాటికి విరిగి కింద పడినట్లుగా తెలుస్తోంది. 

Yadadri Temple Kalasam Fallen Down :  ఈ  విషయంపై ఆలయ అధికారులను వివరణ కోరగా..  దక్షిణ రాజ గోపురం నుంచి ఒక కలశం విరిగి కింద పడగా బుధవారం నాడు ఉదయం మరమ్మతులు చేసి ఆలయ అర్చకులతో సంప్రోక్షణ పూజలు చేపట్టి యధా స్థానంలో ప్రతిష్ఠ చేపట్టామని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ నిర్మాణాలలో పనులు పటిష్టంగా చేయలేదని అందుకే ఇలా జరిగిందని... పలువురు భక్తులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటువంటివి తిరిగి పునరావృతం కాకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details