యాదాద్రికి పోటెత్తిన భక్తులు - అదిరిపోయిన డ్రోన్ విజువల్స్
Published : Dec 23, 2023, 7:20 PM IST
Yadadri Temple Drone Visuals : ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా లక్ష్మీ నరసింహుణ్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం వేళ యాదాద్రి ఆలయ సన్నిధి డ్రోన్ దృశ్యాలు కనువిందు చేశాయి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, కురుస్తున్న పొగమంచుతో ఆలయ గోపురాలు మేఘాలను తాకుతున్నట్లుగా భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
Vaikunta Ekadashi in Yadadri :స్వామి వారి సన్నిధిలో నేటి నుంచి ఈనెల 28 వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాల సందర్భంగా భక్తులచే జరపబడే మొక్కులు, శాశ్వత కళ్యాణాలు, శాశ్వత బ్రహ్మోత్సవాలు,సుదర్శన హోమం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మొదటిరోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీలక్ష్మీ నారసింహ స్వామి, ఆళ్వార్ సేవలతో పాటు ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. నాలాయిర దివ్య ప్రబంధ పారాయణముతో స్నపన మండపము నందు నవకలశాభిషేకము చేశారు. సాయంత్రం 6.30గంటలకు స్వామి వారు మత్స్యావతారమున భక్తులకందరికీ దర్శనం కల్పించారు.