కన్నులపండువగా యాదాద్రీశుడి తెప్పోత్సవం - Yadadri Srilakshmi Narasimha Swamy Temple
Yadadri Lakshmi Narasimha swami Teppotsavam: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా యాదాద్రీశుడికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. మొదట స్వామిని అమ్మ వారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సమయంలో యాదాద్రీశుడి నామస్మరణతో యాదాద్రి కొండ మార్మోగింది. కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా తెప్పోత్సన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చైత్ర పౌర్ణమి కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కొండపై బాలాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. తెల్లవారు జామున సుప్రభాతం నిర్వహించి స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు ఆర్జిత పూజలు జరిపించారు. నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగించారు. ఉత్సవ మూర్తులకు నిజాభిషేకంతో ఆరాధనలు జరిపించారు. శ్రీలక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ హారతి నివేదనలు అర్పించారు. లడ్డు ప్రసాదాల కౌంటర్, ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది.