తెలంగాణ

telangana

Yadadri Temple Rain Visuals

ETV Bharat / videos

చిరుజల్లుల్లో యాదాద్రి ఆలయం.. ఎంత అద్భుతంగా ఉందో..? - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం విజువల్స్

By

Published : Apr 4, 2023, 11:21 AM IST

Yadadri Temple Rain Visuals : మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు, రేపు వర్షాలు కురవనున్నట్లు తెలిపిందే. అయితే సోమవారం రోజున కూడా పలుచోట్ల వర్షాలు కురిసినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం రోజున యాదాద్రి భువనగరి జిల్లాలో పలుచోట్ల వాన కురిసింది.

సోమవారం సాయంత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో చిరుజల్లులు కురిశాయి. దాదాపు ఏకధాటిగా గంటపాటు కురిసిన వర్షం వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా వాన కురవడం వల్ల ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అటూ ఇటూ పరుగులు తీశారు. చివరకు ఆలయంలో తలదాచుకున్నారు. 

ఏకధాటిగా కురిసిన చిరుజల్లుల్లో ఆలయ శిల్పాలు, గోపురాలు, ప్రాకార మండపాలు తడిశాయి. వర్షంలో తడుస్తున్న ఆలయ ప్రాంగణాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు. ముఖ్యంగా రాత్రి వేళలో ఓవైపు విద్యుద్ కాంతులు.. మరోవైపు వర్షపు చిరుజల్లుల్లో యాదాద్రి ఆలయం జిగేల్‌మంటూ భక్తులను మైమరిపించింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details