తెలంగాణ

telangana

Wrestling Champions In Kamareddy

ETV Bharat / videos

అలరించిన కుస్తీ పోటీలు - ప్రదర్శనలు చూడటానికి ఎగబడ్డ జనాలు - Kamareddy KUSTHI POTILU

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 7:30 PM IST

Wrestling Champions In Kamareddy : కుస్తీ పోటీల్లో మల్ల యోధులు పాల్గోని తన వీరత్వాన్ని ప్రదర్శించి, తమ ప్రతిభతో చూడడానికి వచ్చిన వీక్షకుల మన్ననలతో పాటు, బహుమతులను పొందుతారు. తాజాగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద ఏడికి గ్రామంలో ఎలమాస పండగ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఉదయమే కండోభ మందిరానికి భక్తులు ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు. ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు సంగారెడ్డి, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్ల యోధులు వచ్చారు. 

Wrestling Champions :పోటీలను తిలకించేందుకు మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్ మండలాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు. గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు. ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఈ కుస్తీ పోటీలు చూసేందుకు జనం ఎగబడ్డారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తరలిరాగా, ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ముసలి వాళ్లు సైతం చెట్లు ఎక్కి సైతం మరీ పోటీలను వీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details