తెలంగాణ

telangana

Worlds Costly Dog Roamed in Hyderabad

ETV Bharat / videos

రూ.20 కోట్ల శునకం హైదరాబాద్​లో హల్​చల్​ - చూసేందుకు ఎగబడిన జనం - ప్రపంచంలో అత్యంత ఖరీదైన కుక్క

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 2:01 PM IST

Updated : Dec 16, 2023, 2:47 PM IST

Worlds Costly Dog Roamed in Hyderabad :ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అరుదైన జాతి కాకసియాన్ షెఫర్డ్ డాగ్ హైదరాబాద్​​లో సందడి చేసింది. రూ.20 కోట్ల విలువ చేసే ఈ శునకంతో స్థానికులు సెల్ఫీలు తీసుకున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు దాంతో ఫొటోలు దిగారు. బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీశ్​ ఆ కుక్కను రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. మియాపూర్​లోని మదీనాగూడలోని విశ్వాస్ పెట్ క్లినిక్​కు ఈ డాగ్​ను తీసుకొచ్చారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ కుక్క రష్యా బ్రీడ్​కు చెందినది తెలిపారు. సినిమాల్లో, ఈవెంట్లలో కుక్క పాల్గొనడం వల్ల ఇది ఇంత ఫేమస్ అయిందని అన్నారు. మూడు సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ రోజుకు మూడు కేజీల చికెన్​ను ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. ఈ శునకంతో వచ్చే నెలలో బెంగళూరులో 150 బైకు​లతో రష్యా హీరో హీరోయిన్స్​తో అతిపెద్ద ఈవెంట్ చేస్తున్నట్లు డాగ్ ఓనర్ పేర్కొన్నారు. 

Last Updated : Dec 16, 2023, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details