తెలంగాణ

telangana

World Cup 2023 Final

ETV Bharat / videos

ఫైనల్ ఫీవర్​- జెర్సీలు ధరించి హోమాలు, క్రికెట్​ గణేశ్​కు పూజలు- భారత్​ గెలవాలని ఫ్యాన్స్​ తీరొక్క మొక్కులు! - క్రికెట్ గణేశునికి ప్రత్యేక పూజలు

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 3:53 PM IST

World Cup 2023 Final : ప్రపంచ కప్​ తుదిపోరుకు సర్వం సిద్ధమైంది. దీంతో దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమ్ఇండియా గెలవాలన్న నినాదాలే  వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్​ సేన.. ఈ మ్యాచ్​లోనూ గెలుపొంది కప్​ను కైవసం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో అభిమానాన్ని చాటుతున్నారు. హోమాలు, పూజలు చేస్తూ రోహిత్​ సేన గెలవాలని కోరుకుంటున్నారు. టీమ్ఇండియా ప్లేయర్ల జెర్సీలను ధరించి వారి ఫోటోలు చేతపట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు చెన్నైలోని క్రికెట్ వినాయకునికి ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 తలల విగ్రహరూపంలో ఉన్న క్రికెట్ గణనాథుడు.. జట్టులోని 11 మంది క్రికెటర్లను ప్రతిబింభిస్తారని అభిమానుల విశ్వాసం. క్రికెట్ ప్రేమికులు నిర్మించిన ఈ దేవాలయంలో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్లు, బౌలింగ్ వేస్తన్నట్లు వివిద భంగిమల్లో వినాయకుని విగ్రహాలను సైతం ప్రతిష్ఠించారు. వరల్డ్ కప్​ ఫైనల్​ వేళ భారత్ జట్టు గెలవాలని క్రికెట్ అభిమానులు  ఇక్కడ భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోవైపు ముంబయిలో కొంతమంది అభిమానులు ప్రత్యేక హోమాలను నిర్వహించారు. మధవ్ బాగ్ శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో వేదిక టీమిండియా గెలవాలని అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రికెట్ ప్రేమికులు టీమిండియా జర్సీలను ధరించి..త్రివర్ణ పతాకాలు చేతబూని భారత్ ఫైనల్ లో విజయం సాధించాలని నినాదాలు చేశారు.

రోహిత్ సేన విజయం సాధించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కిన్నార్ అఖారా సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత క్రికెటర్ల పొస్టర్లకు విజయ తిలకం పూసి హారతి ఇచ్చారు. తమ పూజలు ఫలించి భారత్ ప్రపంచకప్ గెలిచి జగజ్జేతలుగా నిలవాలని అభిలాషించారు.

పుష్కర కాలం తర్వాత టీమ్ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికితోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఒడిశాకు చెందిన సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పూరీ తీరంలో 56 అడుగుల ప్రపంచకప్ ట్రోఫీని తీర్చిదిద్ది టీమిండియాకు గుడ్ లక్ చెప్పారు. ఈ సైకత శిల్పం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details