World Chocolate Day 2023 : చాక్లెట్‌తో హెల్తీ హార్ట్ మీ సొంతం.. ఎక్కువ తింటే ఇబ్బందే! - గుండె ఆరోగ్యానికి డార్క్ చాక్లెట్
World Chocolate Day 2023 : చాక్లెట్లు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. చాక్లెట్లను అందరూ ఇష్టపడతారు. చాక్లెట్లలో ఐరన్, మెగ్నిషీయం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
Chocolate Health Benefits : చాక్లెట్లు తినడానికి ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయి. చాక్లెట్లలో ఉండే కొన్ని రకాల రసాయనాలు వల్ల ఎండార్ఫిన్ హార్మోన్, సెరోటోనిన్ అనే మోనో ఆమైన్, న్యూరో ట్రాన్స్‌మీటర్ విడుదల అవుతాయి. వీటి వల్ల మానసిక ఉల్లాసం, సంతోషం కలుగుతుంది.
Chocolate Types : మనం ఎంతోగానో ఇష్టపడే చాక్లెట్లలో మూడు రకాలు ఉంటాయి. డార్క్ చాక్లెట్లు.. పాల పదార్ధాలు అతి తక్కువగా ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. ఇది రక్తనాళాల్లో రక్త ప్రసరణను ప్రేరేపించి బీపీని అదుపులో ఉంచుతాయి. ఇక రెండోది మిల్క్ చాక్లెట్ 12 శాతం పాలు, లేదా పాల పదార్థాలతో చేస్తారు. రుచిలో తీయగా ఉండే ఈ చాక్లెట్లలో చక్కెర, కొవ్వులు అధికంగా ఉంటాయి. మూడోది వైట్ చాక్లెట్.. కొకొవా గింజల నుంచి సేకరించిన బటర్‌తో మాత్రమే వీటిని తయారు చేస్తారు. వీటిలో చాక్లెట్, కొకొవా పౌడర్ వంటివి ఏమీ ఉపయోగించరు.
Chocolate For Heart Health : ఈ చాక్లెట్లను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె పనితీరు మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు. చాక్లెట్లు.. అతినీలలోహిత కిరాణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలా అని మరీ ఎక్కువగా చాక్లెట్లు తింటే.. స్థూలకాయం, మధుమేహం, హైపర్ టెన్షన్ లాంటి ధీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. శుక్రవారం (జులై 7) ప్రపంచ చాక్లెట్ డే సందర్భంగా వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పూర్తి వీడియో చూడండి.