Women Dropped in vagu Live Video : వాగు దాటుదాం అనుకున్నారు.. కాని ఇంతలో! - వాగులో పడిన మహిళ
Women Dropped in Vagu in Bhadradri Kothagudem : రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నందున వాగులు, చెరువులు, నదులు, కాలువలు, జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. అందువల్ల వాటివైపు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే పలు సూచనలు ఇచ్చారు. ఒక్కోసారి నియమాలు పాటించిన ప్రమాదాలు జరుగుతాయి. అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం కుమ్మరిపాడు వద్ద పాములేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఒక మహిళ గల్లంతయ్యింది. వరి నాట్లకు వెళ్లి వస్తున్న మహిళా కూలీలు పాములేరులో లెవల్ చాప్ట దాటవలసి వచ్చింది. 10 మంది మహిళలు గుంపుగా ఉదృత్తంగా ప్రవహిస్తున్న వాగు దాటాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో కూరసం సీత అనే మహిళ పట్టుతప్పి నీటి ప్రవాహంతో కొట్టుకుపోయింది. మరో మహిళ కూడా నీటి ప్రవాహనికి వాగులో జారితే.. తోటి మహిళలు కాపాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో నీరు ఎక్కువగా ఉన్న మార్గం నుంచి వెళ్లాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం తగ్గినంత వరకు దూర ప్రాంతాలకి వెళ్లడం, బయట తిరగడం తగ్గించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.