తెలంగాణ

telangana

బస్సుపై రాళ్లు విసిరిన మహిళ కు రూ 5 వేల జరిమానా

ETV Bharat / videos

బస్సు ఆపలేదని రాళ్లు విసిరిన మహిళ.. అద్దాలు ధ్వంసం.. రూ.5వేల ఫైన్​తో షాకిచ్చిన ఆర్టీసీ! - మహిళ దాడిలో బస్సు అద్దాలు ధ్వంసం

By

Published : Jun 26, 2023, 12:44 PM IST

బస్సు ఆపలేదనే ఆగ్రహంతో రాళ్లు విసిరింది ఓ మహిళ. దీంతో ఆ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రభుత్వ వాహనంపై దాడి చేసినందుకుగాను ఆ మహిళకు రూ.5వేల జరిమానాను విధించారు అధికారులు. కర్ణాటకలోని కొప్పల్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..
లక్ష్మి.. పాపనపల్లి ప్రాంతానికి చెందిన మహిళ. హోసలింగపుర​కు హులిగెమ్మ దేవి దర్శనం కోసం వచ్చింది. దర్శనం ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చి.. బస్​ ​కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో అటుగా వచ్చిన నాన్​స్టాప్ బస్​ను ఆపమని విజ్ఞప్తి చేసింది. కానీ డ్రైవర్ దానిని ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన లక్ష్మి.. దానిపై రాళ్లతో దాడి చేసింది. దాడికి గురైన బస్సు కొప్పల్ నుంచి హోస్పేట వెళుతోంది.

వెంటనే బస్సును ఆపిన కండక్టర్​.. డిపో మేనేజర్​కు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి వచ్చిన డిపో మేనేజర్ మహిళకు రూ.5వేలు చెల్లించాల్సిందిగా సూచించాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో అధికారులకు క్షమాపణ చెప్పిన మహిళ.. అనంతరం ఆ జరిమానా మొత్తాన్ని చెల్లించింది. తిరిగి అదే బస్సులో తన గమ్యస్థానానికి వెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details