తెలంగాణ

telangana

Woman Strangled In Delhi Video

ETV Bharat / videos

మహిళను గొంతు నులిమి చంపడానికి దొంగ యత్నం- పర్సు, ఫోన్​తో పరార్ - మహిళ గొంతు నులిమిన వీడియో

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 10:36 PM IST

Woman Strangled In Delhi Viral Video :దిల్లీలోని ద్వారకలో ఓ దొంగ కలకలం సృష్టించాడు. ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను వెనుక నుంచి వచ్చి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అనంతరం పర్సు, ఫోన్​ దొంగిలించి పారిపోయాడు. ఈ ఉదంతం జనవరి 6న ఉత్తమ్​నగర్​ ప్రాంతంలోని ఓ వీధిలో ఉదయం 6.30 గంటల సమయంలో జరిగింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.  

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని పట్టుకోవడం కోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఆ బృందం సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసింది. అతడ్ని దిల్లీలోని చాణక్యపురికి చెందిన 38 ఏళ్ల శివ కుమార్​గా గుర్తించింది. అయితే ఘటన జరిగిన రోజే నిందితుడిని అరెస్టు చేశామని ద్వారక డీసీపీ హర్ష వర్ధన్ తెలిపారు. కాగా నిందితుడిపై ఇదివరకే 6 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.  

ABOUT THE AUTHOR

...view details