యువకుడ్ని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన మహిళ - woman hit young man with car in Karnataka
కర్ణాటకలో యువకుడ్ని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది ఓ మహిళ. శుక్రవారం బెంగళూరులో ఈ దారుణం జరిగింది. ఘటనకు ముందు జ్ఞానభారతి మెయిన్‌రోడ్‌పై ఉల్లాలలో వద్ద బాధితుడు, నిందితురాలి కార్లు పరస్పరం ఢీకొన్నాయి. కారు దిగి మహిళను నిలదీసేందుకు ప్రయత్నించాడు దర్శన్ అనే యువకుడు. దీంతో ఆవేశంతో సదరు మహిళ.. దర్శన్‌ను కారుతో ఢీకొట్టి దూసుకెళ్లింది. ఆ సమయంలో.. కారు ముందు భాగంపై యువకుడు ఉండటం సీసీటీవీ సృష్టంగా కనిపిస్తోంది. కాగా బాధితుడి స్నేహితుడు మహిళ కారు అద్దాలను ధ్వంసం చేశాడు. నిందితురాలు, ఆమె భర్తపై దాడి చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలిని ప్రియాంకగా వారు గుర్తించారు. దర్శన్ స్నేహితులపైనా కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. ఘటనలో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.