తెలంగాణ

telangana

Woman Halchal With Blade in Hyderabad viral video

ETV Bharat / videos

Woman Halchal in Hyderabad Viral Video : మద్యం మత్తు.. నడిరోడ్డుపై అర్ధనగ్నంగా యువతి హల్​చల్​​​.. వచ్చీపోయే వారిని..! - అశోక్​నగర్​లో మద్యం మత్తులో యువతి హల్చల్​ వైరల్​

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 10:21 AM IST

Woman Halchal in Hyderabad Viral Video : మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అర్ధనగ్నంగా రోడ్లపై తిరుగుతూ.. బ్లేడుతో హల్​చల్ చేసిన ఘటన హైదరాబాద్​లోని అశోక్​నగర్​ చౌరస్తాలో చోటుచేసుకుంది. దోమల్​గూడా పోలీస్​స్టేషన్ పరిధిలోని అశోక్​నగర్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్న యువకులపై.. సదరు యువతి బ్లేడుతో దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన స్థానిక యువకులు.. స్థానిక పోలీస్​స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న చిక్కడపల్లి మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ యువతిని అదుపులోకి తీసుకుని దుస్తులు తొడిగారు. అనంతరం ఆటోలో ఎక్కించుకుని దోమలగూడ పోలీస్​స్టేషన్​కు తరలించారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి.. కొద్ది సమయం తర్వాత స్వతహాగా పోలీస్​స్టేషన్ నుంచి బస్సులో ఎక్కి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. యువతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నగరంలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో పలువురు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details