తెలంగాణ

telangana

Woman Fell On Train Tracks

ETV Bharat / videos

రైలు పట్టాలపై స్పృహతప్పి పడిపోయిన మహిళ.. సడెన్​గా​ వచ్చిన గూడ్స్​.. లక్కీగా.. - మహిళపై నుంచి వెళ్లిపోయిన రైలు

By

Published : Jul 2, 2023, 7:07 PM IST

Woman Fell On Train Tracks : ఉత్తర్​ప్రదేశ్​ కాస్​గంజ్​లో ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ మహిళ స్పృహతప్పి రెండు రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఆ సమయంలో ఓ గూడ్స్​ రైలు అదే రైల్వే ట్రాక్​పై నుంచి వస్తోంది. ఆ మహిళ ట్రైన్​ శబ్దం విన్నా కూడా పైకి లేవకపోవడం వల్ల అక్కడ ఉన్న స్థానికులు ఆందోళన చెందారు. ఆమె రైలు కింద పడి మరణించడం ఖాయమని అనుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ రైలు​ రెండు పట్టాల మధ్య ఆమె స్పృహతప్పి పడిపోవడం వల్ల.. ఆమెపై నుంచి ట్రైన్​ వెళ్లినా ఏమీ కాలేదు. ఈ ఘటన సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సహవర్ రైల్వే క్రాసింగ్ గేటు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన.

బాబూపుర్ గ్రామానికి చెందిన హరి ప్యారీ(40) అనే మహిళ.. మందులు కొనేందుకు సహవర్ రైల్వే స్టేషన్​ వైపు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు అకస్మాత్తుగా తల తిరిగి.. స్పృహతప్పి రైల్వే ట్రాక్​పై పడిపోయింది. హరి ప్యారీని రైల్వే ట్రాక్‌పై నుంచి పక్కకు తీసేందుకు కొందరు వ్యక్తులు పరుగెత్తారు. అప్పటికే ఓ గూడ్స్ రైలు అదే లైన్‌లో వచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఊరుకున్నారు. అయితే కొన్ని బోగీలు హరి ప్యారీ పైనుంచి వెళ్లేసరికి ఆమెకు మెలకువ వచ్చింది. కాళ్లు, చేతులు కదపవద్దని సూచిస్తూ స్థానికులు కేకలు వేశారు. రైలు వెళ్లాక.. స్థానికులు ఆమెను ట్రాక్​పై నుంచి పక్కకు తీశారు. హరి ప్యారీకి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని.. ఆస్పత్రికి తరలించారు. హరి ప్యారీ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details