తెలంగాణ

telangana

Woman Died Because Of Monkey Attack in Mahabubabad

ETV Bharat / videos

Woman Died Because Of Monkey Attack in Mahabubabad : కోతి మూక అల్లరికి మహిళ బలి.. ఎలా చనిపోయిందంటే.. - మహబూబాబాద్ వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 1:18 PM IST

Woman Died Because Of Monkey Attack in Mahabubabad : మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో దూసుకు వస్తుందో ఎవ్వరికి తెలియదు. కోతుల కారణంగా మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక లక్ష్మీ థియేటర్ సమీపంలో గల సాబీరా బేగం (55) అనే మహిళ ఇంటి పై గత రాత్రి నుంచి కోతుల గుంపు తిష్ట వేశాయి. ఉదయం నిద్ర లేచి ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న క్రమంలో ఇంటిపై ఉన్న సిమెంట్  దిమ్మకు కట్టి ఉన్న సర్వీస్  వైరును గట్టిగా కోతుల గుంపు ఊపడంతో ఒక్కసారిగా దిమ్మ ఊడిపోయి.. కింద ఉన్న సాబీరాపై పడింది. దీంతో సాబీరాకు గాయాలయ్యాయి.

వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పడికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో పట్టణ ప్రజలు బయటకు రావాలంటేనే  భయపడుతున్నారని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టణంలో కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని మృతురాలి బంధువులు అధికారులకు, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details