Woman Dead Body carried On Doli : డబ్బుల్లేక డోలీలో శ్మశానానికి మృతదేహం తరలింపు.. కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో - ఉత్తర్‌ప్రదేశ్‌లో డోలీపై మహిళ మృతదేహం తరలింపు
Published : Oct 14, 2023, 2:27 PM IST
Woman Dead Body carried On Doli :మృతదేహాన్ని తరలించడానికి డబ్బులు లేక డోలీలో శ్మశాన వాటికకు తరలిచింది ఓ నిరుపేద కుటుంబం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ హృదయ విదారక ఘటన దృశ్యాలు కంటతడి పెట్టుస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం జరిగిందీ ఈ ఘటన.
ఇదీ జరిగింది..
ప్రయాగ్‌రాజ్‌లోని సంగమనగరిలో రోడ్డు పక్కన గుడారంలో ఓ సంచార కుటుంబం నివసిస్తోంది. అందులో నఖ్రు అనే వ్యక్తి భార్య అనిత శుక్రవారం చనిపోయింది. మృతదేహాన్ని తరలించడానికి ఆ నిరుపేద కుటుంబం వద్ద డబ్బులు లేవు. తెలిసిన వారు కూడా సహాయం చేయలేదు. దీంతో డోలీలో మృతదేహాన్ని మోస్తూ శ్మశాన వాటికకు బయలుదేరారు. దీన్ని గమనించిన స్థానికులు ఝాన్సీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ నవీన్‌సింగ్.. వారికి ఆర్థిక సహాయం చేశారు. ఇది చూసి స్థానికులు కూడా ఆ నిరుపేద కుటుంబానికి అత్యక్రియల నిమిత్తం రూ.ఐదున్నర వేలు విరాళాలు ఇచ్చారు. దీంతో పాటు మృతదేహాన్ని తరలించడానికి ఆటో రిక్షా ఏర్పాటు చేశారు. వారికి ఆర్థిక సాయం కోసం మరికొంత మొత్తం జమచేశారు. అయితే ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను 'ఈటీవీ భారత్' ధ్రువీకరించలేదు.