తెలంగాణపై చలి పంజా - వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్న వైద్యులు - చలికాలంలో సీజనల్ వ్యాధులు
Published : Dec 29, 2023, 1:36 PM IST
Winter Health Tips Telugu : రాష్ట్రంలో చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. శీతాకాలం వస్తే చాలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. వైరస్‌ల వ్యాప్తి ఎక్కువగానే ఉంది. దీనికితోడు తక్కువ ఉష్ణోగ్రతలు సూక్ష్మజీవుల ఎదుగుదలకు సహకరిస్తాయన్న విషయం తెలిసిందే. మరోవైపు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య కూడా చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగుల పరిస్థితి చలి విసిరే పంజాకు అద్దం పడుతోంది.
Increasing Cold Intensity in Telangana : ఈ నేపథ్యంలో వైద్యులు పలు సలహాలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తగా తప్పని సరి అని అంటున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రక్తనాళాలు కుచించుకు పోవటంతో పాటు, రక్తం గడ్డ కట్టే సమస్యలు ఈ కాలంలో అధికంగా ఉంటాయని చెబుతున్నారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా బాడీ చెకప్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాలు తదితర అంశాలను గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును అడిగి తెలుసుకుందాం.