తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆహారం కోసం వచ్చి బావిలో పడ్డ ఏనుగును రక్షించారిలా - ఏనుగును కాపాడిన సిబ్బంది

By

Published : Dec 5, 2022, 12:43 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

కర్ణాటకలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలో పడింది. రామనగర్​ జిల్లా చెన్నపట్నం మండలంలోని అమ్మల్లదొడ్డి గ్రామంలో జరిగిందీ ఘటన. అడవి నుంచి ఆహారం కోసం పంటపొలాల్లోకి వచ్చిన ఓ ఏనుగు బావిలో పడి ఉండటాన్ని గ్రామస్థులు గుర్తించారు. వెంటనే వారు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో బావి అంచును తవ్వించారు. దీంతో బావిలో ఉన్న గజరాజు సునాయాసంగా పైకివచ్చి అడవి వైపుగా పరుగులు తీసింది.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details