నీరు తాగేందుకు వెళ్లిన బుల్లి గజరాజు.. గుంతలోపడి మృతి - ఇడుక్కి వాగులో పడి ఏనుగు మృతి
కేరళలోని ఇడుక్కిలో ఓ ఏనుగు పిల్ల.. రాళ్ల వాగు నీటి గుంతలో పడి మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటన పరకుట్టి గిరిజన కాలనీకి సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. గుంతలో పడి ఉన్న ఏనుగు పిల్ల మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. ఏనుగు పిల్లను బయటకు తీశారు. బుల్లి గజరాజు నీరు తాగేందుకు ప్రయత్నించి నీటి గుంతలో జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ ఏనుగు పిల్ల గత కొన్ని రోజులుగా అదే ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు తెలిపారు. పంట పొలాలకు సమీపంలో తిరిగినా సరే.. దీని వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం కలగలేదని వారు వెల్లడించారు. ఏనుగు పిల్ల మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.