Pratidwani నాలుగు ప్రాణాలు... బాధ్యత ఎవరిది? - కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స
Pratidwani: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో అనుకోని అపశృతి చోటు చేసుకుంది. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వైద్యరంగంలో డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ శస్త్రచికిత్సలు విస్తృత ప్రజాదరణ పొందినవే. అయినా.. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఈ ఆపరేషన్లతో మహిళల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న34 మందిలో చాలామందిని మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం నిమ్స్‌కు తరలించింది. వైద్యంరంగం ఎప్పుడో పట్టు సాధించిన సాధారణ కు.ని.ఆపరేషన్లు ఎందుకిలా విషాదంగా మారాయి? పదుల సంఖ్యలో ఆపరేషన్లు చేస్తున్న సమయంలో వైద్యులు స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారా? వైద్యచికిత్సల్లో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST