సిరొంచలో శ్వేతనాగు ప్రత్యక్షం - telangana latest news
white snake saw in sironcha: సాధారణంగా కోబ్రాలు నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. మహారాష్ట్రలోని సిరొంచలో శ్వేతనాగు ప్రత్యక్షమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచలో శ్వేతనాగు కనిపించింది. పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా చూశారు. ఓ ధాన్యం మిల్లు ఆవరణలో ఇది కనిపించగా మిల్లు సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఈ అరుదైన నాగుపామును అల్బినో కోబ్రాగా పిలుస్తారు. చర్మ, రక్త సంబంధిత కారణాల వల్ల ఈ పాములు శ్వేతవర్ణంలో ఉంటాయని అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్లోని ఒక కానిస్టేబుల్ పాములు పట్టే నేర్పు ఉండడంతో ఆయన వచ్చి ఎవరికి ఎటువంటి హాని కలగకుండా శ్వేతనాగును ఒడుపుగా బంధించారు. ఇటువంటి అరుదైన ప్రాణులు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయని వాటికి ఎటువంటి హానీ చేయకుండా సంబంధిత అటవీ శాఖ అధికారులకు తెలిజెయలన్నారు. పట్టుకున్న శ్వేతనాగును సిరొంచ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.