రాష్ట్ర ఎన్నికల్లో పల్లెల పాత్ర ఏమిటి ఈసారి ఏ పార్టీ వైపు ఉంటాయో - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 1, 2023, 9:44 PM IST
Role of Villages in Telangana Assembly Elections Today Prathidwani :రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం రోజురోజుకు జోరుగా సాగుతోంది. హామీలు, విమర్శల మధ్య రాజకీయం కొత్త ఎత్తులకు చేరుతోంది. అయితే పల్లెసీమలే అభివృద్ధికి పట్టుకొమ్మలు అనేది జగమెరిగిన సత్యం. గతంలో కంటే పల్లెలు కాస్త అభివృద్ధి చెందినప్పటికీ మరింత అభివృద్ధి అవసరం అనేది జనం మాట. మరి ఎన్నికల పోరులో గ్రామీణ ప్రజల అజెండాకు చోటు కల్పించేందుకు పార్టీలు ముందుకొస్తున్నాయా? ఎన్నికల్లో మనపల్లెలకు ఎలాంటి ప్రాముఖ్యత లభిస్తోంది?
అలాగే రాష్ట్ర ఎన్నికల్లో పల్లెల పాత్ర ఏమిటి? ప్రచారంలో ప్రజా సమస్యలపై హామీలిస్తున్న నాయకులు.. పల్లెలకు ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. అలాగే ప్రభుత్వ లోపాలనే ఆయుధంగా సాగుతున్న విపక్షాలు.. వీటి నడుమ పల్లె ప్రజలకు ఎటువైపు అడుగులు వేస్తారో? పల్లెవాసులను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, విపక్ష పార్టీలు ఎలాంటి ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని.