తెలంగాణ

telangana

What Are The Problems With Low Testosterone Levels

ETV Bharat / videos

టెస్టోస్టిరాన్ లెవెల్స్​​ తగ్గితే ఇబ్బందా?.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? - వీర్యకణాల స్థాయులు తగ్గితే వచ్చే ఆరోగ్య సమస్యలు

By

Published : May 29, 2023, 8:51 PM IST

వయసు పెరుగుతున్నా కొద్దీ టెస్టిస్ ​(వృషణాలు) చిన్నగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. టెస్టిస్​లో ఏవైనా ఇన్ఫెక్షన్​లు సోకినా వాటి సైజు చిన్నగా మారిపోయే ప్రమాదం ఉంది. అధిక మోతాదులో మద్యం సేవిస్తే కూడా టెస్టిస్​పై ప్రభావం చూపుతాయి. అయితే సాధారణంగా టెస్టోస్టిరాన్ స్థాయిలు యవ్వన దశలో పెరుగుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వాటి స్థాయిలు కూడా తగ్గుతూ వస్తుంటాయి. ఇదే హార్మోన్ నిర్ణీత వయసు తర్వాత పురుషుల్లో కొంత తక్కువగానే ఉండవచ్చు. మరీ తక్కువైతే మాత్రం పెద్ద సమస్యగానే భావించాలి. 

అయితే టెస్టోస్టిరాన్ స్థాయిని పెంచుకునేందుకు కొందరు ఇంజక్షన్​లు తీసుకుందామనుకుంటారు. వైద్యుల సలహా లేకుండా వాటిని సరైన రీతిలో తీసుకోకపోతే మంచిదికాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రక్తకణాల సంఖ్య తగ్గడం, బట్టతల, మూడ్​ స్వింగ్స్​, ఎముకల దృఢత్వం సరిగ్గా లేకపోవడం తదితర అనారోగ్య సమస్యలకు టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గటం ప్రధాన కారణంగా చెప్పొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంకా ఈ విషయంపై డాక్టర్ అజిత్​ విక్రమ్​ ఇస్తున్న సలహాల కోసం ఈ వీడియో చూడండి.

ABOUT THE AUTHOR

...view details