Aqua Yoga In Jagtial : వారేవ్వా..!!! 63 ఏళ్ల వయసులో నీటిపై యోగాసనాలు - నీటిలో యోగ
Water Yoga In Jagtial District : అందరు యోగాసనాలు భూమిపై వేస్తుంటే ఈ వ్యక్తి మాత్రం నీటిపై యోగా చేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నాడు. వివిధ రకాల ఆసనాలు వేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధిస్తూనే ఇతరులకు కూడా నీటిపై యోగాసనాలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 63 ఏళ్ల వ్యక్తి అయిన 25 ఏళ్ల యువకుడిలా నీటిలో యోగాసనాలు వేస్తూ అందరిచే ఔరా అనిపించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన డాక్డర్ రాజ రత్నాకర్ వృతిరీత్యా సైకాలజిస్ట్. ప్రవృత్తి రీత్యా సిద్ధ సమాధ యోగ కార్యక్రమాలు చేస్తూ.. వేలాది మంది యువతీ యువకులకు ఉచితంగా యోగ నేర్పిస్తున్నారు. యోగా వల్ల మానసిక స్థితి మెరుగుపడి ఆరోగ్యవంతమైన జీవితం సొంతం అవుతుందని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా జలయోగపై శిక్షణ ఇస్తున్నారు. జలయోగ చేయడం వల్ల ఎన్నో మానసిక రుగ్మతల నుంచి బయట పడొచ్చని అంటున్నారు. సాఫ్ట్ వేర్ పనుల్లో ఒత్తిడి నుంచి బయటకు రావడానికి జలయోగ ఒక మంచి సాధనం అని శిక్షణకు వచ్చినవారు చెబుతున్నారు. జలయోగ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని అంటున్నారు. పూర్వం మునులు, ఋషులు మాత్రమే జలయోగ చేసేవాళ్లు.. కానీ, రాజ రత్నాకర్ సహకారంతో జలయోగ నేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నామని శిక్షణ పొందినవారు తెలిపారు.