తెలంగాణ

telangana

Water in Jagtial Government Hospital

ETV Bharat / videos

Water in Jagtial Government Hospital : ఆసుపత్రిలోకి వర్షపు నీరు.. ఇబ్బంది పడుతున్న రోగులు - తెలంగాణ వార్తలు

By

Published : Jul 25, 2023, 5:09 PM IST

Rain Water in Jagtial Government Hospital: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకి కొన్ని జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాలో ఇళ్లు, రోడ్లు, వైద్యశాలలు జలమయమయ్యాయి. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వరద నీరు వచ్చింది. ఆ వైద్యశాలోని మాత శిశు కేంద్రంలో పై ఫ్లోర్లో నీళ్లు చేరి రోగులకు ఇబ్బందిగా మారింది. దీంతో రోగులను అక్కడి నుంచి వేరే దగ్గరకి తరలించారు. ఆ ప్లోరు పైనా ఆసుపత్రి సిబ్బంది రేకుల షెడ్డు వేసి వార్డులను ఏర్పాటు చేశారు. షెడ్డు నిర్మాణంలో నాణ్యత లోపం వల్ల వర్షం నీరు భారీగా చేరిందని రోగులు, స్థానికులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నీటిని బయటకి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వరద నీటి వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున రోగులకు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details