తెలంగాణ

telangana

ఆకాశంలో చైనా ఆర్మీ పైలట్​ అత్యుత్సాహం.. భయపడ్డ అమెరికా పైలట్​.. చివరకు..

ETV Bharat / videos

చైనా జెట్ పైలట్​ అత్యుత్సాహం.. అమెరికా యుద్ధ విమానంపైకి దూసుకెళ్లి..

By

Published : May 31, 2023, 1:53 PM IST

US Jet China Sea : గగనతలంలో ఎగురుతున్న అమెరికా ఆర్మీ విమానానికి.. చైనా జెట్ అతి సమీపానికి రావడం కలకలం సృష్టించింది.  సైనిక విమానం వైపు చైనా పైలట్​ తన జెట్​తో దూకుడుగా దూసుకురావడం వల్ల అమెరికా పైలట్లు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఈ ఘటన దక్షిణ చైనా సముద్రం మీదుగా రెండు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు ఎగురుతున్న సమయంలో జరిగింది.  చైనా యుద్ధ విమానం పైలట్​ చేసిన పనికి తమ పైలట్​ ఆందోళనతో విమానాన్ని నడపాల్సి వచ్చిందని అమెరికా సైన్యం మంగళవారం తెలిపింది.

చైనీస్ J-16 ఫైటర్​ జెట్​ ప్లేన్​లోని పైలట్ గత శుక్రవారం అంతర్జాతీయ గగనతలంలోకి సాధారణ కార్యకలాపాలను నిర్వహించడానికి బయలుదేరాడు. ఇదే సమయంలో యూఎస్​కు చెందిన RC-135 ఫ్లైట్​ కూడా ఆకాశంలో విహరిస్తోంది. ఈ క్రమంలో అమెరికా విమానం ముందుకు డ్రాగన్​ విమానం ఒక్కసారిగా దూసుకువచ్చిందని యూఎస్​ ఇండో-పసిఫిక్ కమాండ్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, చైనా పైలట్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది అమెరికా వాయుసేన. అయితే చైనా సైన్యం కావాలనే అనవసరమైన దూకుడు చర్యలకు పాల్పడుతోందని అమెరికా వాయుసేన మండిపడింది. 

ABOUT THE AUTHOR

...view details