కారు డ్రైవర్ దారుణం.. వృద్ధుడిని ఢీకొట్టి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. - బిహార్ పట్నా రోడ్డు ప్రమాదం
Car driver hits man: ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టిన ఓ వ్యక్తి.. అనంతరం తనతో గొడవకు దిగిన వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు. బిహార్ పట్నాలో ఈ ఘటన జరిగింది. నాగేశ్వర్ కాలనీలో ఓ ద్విచక్రవాహనంపై వస్తున్న వృద్ధుడిని నిందితుడు తన కారుతో ఢీకొట్టాడు. కారు బలంగా తాకడం వల్ల వృద్ధుడు పైకి లేవలేకపోయాడు. అయినా కష్టమీద పైకి లేచి.. కారు డ్రైవర్ దగ్గరికి వెళ్లాడు. వృద్ధుడికి సహాయం చేయాల్సింది పోయి.. కారు డ్రైవర్ మరింత కఠినంగా ప్రవర్తించాడు. అలాగే కారును ముందుకు పోనిచ్చాడు. కారును అలాగే గట్టిగా పట్టుకున్న వృద్ధుడిని పట్టించుకోకుండా ఈడ్చుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక బాధితుడు కిందపడిపోయాడు. స్థానికులు దీన్ని వీడియో తీశారు. వృద్ధుడు కింద పడి స్పృహ కోల్పోయినా.. కారులోని వ్యక్తి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.