Warangal Rains : రికాం లేని వానలు.. రైల్వేస్టేషన్లోకి వరదలు
Heavy Rainfall in Warangal : రాష్ట్రంలో రికాం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరద బాధితులు అల్లాడిపోతున్నారు. ఇళ్లలోకి నీరు రావడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. వరుసగా వస్తున్న వరదకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వాగులు, కాలువలు నిండి ఊళ్లలోకి వరద నీరు ప్రవేశిస్తుంది. ఇళ్లలోకి నీరు వస్తున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానల కారణంగా రోడ్లు, వాగులు, చెరువులు. కాలువల నిండి పొంగి పొర్లుతున్నాయి. రైల్వే స్టేషన్‌లల్లోకి కూడా నీరు చేరాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరంగల్ పరిస్థితుల పైన సమీక్షించారు. అక్కడి పరిస్థితులపై సీఎస్ శాంతకుమారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వరద బాధిత జిల్లాలకు ప్రత్యేత అధికారులని నియమించారు సీఎస్ శాంత కుమారి. వరద ప్రభావంతో పలు రైల్వే స్టేషన్‌లలో నీరు చేరడంతో రైళ్లను అధికారులు నిలిపివేశారు. వర్షం ఉద్ధృతి కారణంగా పలు రైళ్లు 30కి.మీ. వేగంతో నడుస్తున్నాయి.