తెలంగాణ

telangana

Old Students Meet After 53Years in Hyderabad

ETV Bharat / videos

Alumni Association: పదహారేళ్ల వయసులో విడిపోయి.. 70 ఏళ్ల వయసులో కలుసుకుని - పాత విద్యార్థినిల కలయిక

By

Published : Mar 6, 2023, 9:02 AM IST

Alumni Association After 53 Years: పదహారేళ్ల వయసులో విడిపోయిన వారంతా.. 70వ దశకంలో కలిశారంటా. పలకరింపులు, పరామర్శలు, కుశల ప్రశ్నలు జీవితంలో ఎన్నెన్నో తీపి గుర్తులను పంచుకున్నారు. 1969లో వారంతా 12వ తరగతి వరకు చదివి.. అక్కడి నుంచి ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అంతా ఉన్నత చదువులు చదివి.. డాక్టర్లు, కవయిత్రి, బ్యాంక్‌లలో పని చేసి పదవీ విరమణ పొంది.. స్నేహ బంధం పేరుతో మళ్లీ కలుసుకున్నారు.

వరంగల్ ఫాతిమా గర్ల్స్ మల్టిపర్పస్ హైస్కూల్ కాజీపేటలో 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం వేళ ఇబ్బందులు పడుతూ చదువుకున్న విద్యార్థినులు ఒక దగ్గర చేరారు. అప్పుడు చదువుకున్న వాళ్లలో ఒకరికి వచ్చిన ఆలోచనతో దాదాపు (53 ఏళ్లు) అర్ధ శతాబ్దం తర్వాత ఒక చోట కలుసుకున్నారు. 16 ఏళ్ల వయస్సులో విడిపోయిన వారు.. 70 ఏళ్ల వయస్సులో మళ్లీ తిరిగి మీట్ అయ్యారు. ఒకరికొకరు ఆరోగ్యం, కుటుంబాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.  

కుటుంబాలతో శేష జీవితం గడుపుతున్న వారు.. ఫోన్‌ల ద్వారా సమయం సర్దుబాటు చేసుకొని 53 ఏళ్ల కిందట 5-3-1969న విడిపోయి.. అదే రోజు 5-3-2023న హైదరాబాద్‌ శామీర్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఫామ్‌ హౌస్‌లో కలుసుకుని మధుర జ్ఞాపకాల్లో మునిగిపోయారు. ఒకరికి ఒకరు చీరలు, తాము రాసిన పుస్తకాలు, గుర్తుగా దాచుకునే వస్తువులను ఇచ్చుకున్నారు. 70 ఏళ్ల కిందట వారు పాఠశాలలో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుని చిన్నపిల్లల మాదిరిగా మారిపోయి.. వయసును, బాధలను మరచి, ఫ్రెండ్స్​తో రోజంతా ఆనందంగా గడిపారు.

తమతో కలిసి చదువుకుని మృతి చెందిన తోటి స్నేహితుల మరణానికి అందరూ కలిసి మౌనం పాటించి నివాళులు అర్పించారు. వరంగల్ ఫాతిమా స్కూల్‌లో చదివిన మరింత మంది విద్యార్థులను కలుస్తామంటూ.. సంతోషం వ్యక్తం చేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969లో విడిపోయిన వీరంతా, మళ్లీ స్వరాష్ట్రంలో కలుసుకుని జ్ఞాపకాల దొంతరలో మునిగితేలారు.

ABOUT THE AUTHOR

...view details