హిందీ ప్రశ్నపత్రం లీకేజీపై వరంగల్ సీపీ స్పందన.. ఏమన్నారంటే..? - hindi paper leakage in warangal
SSC Hindi paper Leakage : పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఎలా బయటికొచ్చిందనే విషయం విచారణలో తేలుతుందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రశ్నపత్రం వరంగల్‌లోని పరీక్షా కేంద్రం నుంచి వచ్చిందనే విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదన్న ఆయన.. ఇది ముమ్మాటికీ లీక్ కాదని స్పష్టం చేశారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ఓ వాట్సప్‌లో గ్రూప్‌లో గుర్తించారని.. దీంతో విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదన్నారు.
'ఇది పేపర్ లీకేజీ కాదు. కాపీయింగ్‌లో భాగంగా ప్రశ్నపత్రం బయటికొచ్చింది. 10.47 గంటల సమయంలో ఓ వ్యక్తికి వాట్సప్ ద్వారా ప్రశ్నపత్రం వచ్చింది. పరీక్ష ప్రారంభమైంది 9-30 గంటలకు. పరీక్ష కంటే ముందు ప్రశ్నపత్రం బయటకు రాలేదు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత పేపర్ బయటికొచ్చింది. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో బయటికి వచ్చినా నష్టం ఉండదు. పేపర్ లీకేజీ వరంగల్‌లోని ఉప్పల్ నుంచి బయటికి వచ్చిందనేది ప్రచారం మాత్రమే కానీ నిర్ధారణ కాలేదు. పేపర్ ఎలా బయటకొచ్చిందనేది విచారణలో తెలుస్తుందని రంగనాథ్ తెలిపారు.'