Warangal Chess Player Velpula Sarayu Interview : చెస్‌లో సత్తా చాటుతోన్న సరయు.. గ్రాండ్ మాస్టర్ హోదాకు అడుగు దూరంలో..! - వేల్పుల సరయు
Published : Aug 31, 2023, 9:08 PM IST
Warangal Chess Player Velpula Sarayu Interview : చిన్న వయసులోనే చదరంగంలో అదరగొడుతోంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సరయు.. అంతర్జాతీయ వేదికలపై చదరంగం ఆడి ఇప్పటికే పలు విజయాలను సొంతం చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన వేల్పుల సరయు.. తండ్రి ప్రోత్సాహంతో చెస్ ఆటపై ఆసక్తి పెంచుకుంది.
Chess Player Sarayu Interview : రాష్ట్ర, జాతీయ స్థాయి చదరంగ పోటీల్లో ప్రతిభ కనబరుస్తోంది. చెస్‌లో ప్రత్యేక శిక్షణతో ప్రతిభను మెరుగుపరుచుకున్న సరయు.. స్పెయిన్‌లో జరిగిన గ్రాండ్ మాస్టర్ టోర్నీలో సత్తా చాటింది. ఒకేసారి మూడు నామ్స్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ స్థాయిలో 1845 రేటింగ్‌తో ముందుకు సాగుతోంది. మరో రెండు నామ్స్ సాధిస్తే ఉమెన్ గ్రాండ్ మాస్టర్ హోదా అందుకోనుంది. ఇంత చిన్న వయసులో తనకు ఇందంతా ఎలా సాధ్యం అయ్యింది..? తన భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి..? తన ముందున్న లక్ష్యం ఏమిటి..? ఆ చెస్ ప్లేయర్ మాటల్లోనే విందాం.