War of Words Between Harishrao and Revanth Reddy : నువ్వా నేనా.. హరీశ్‌రావు రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం - harishrao counters aganist revanthreddy
Published : Oct 4, 2023, 3:40 PM IST
War of Words Between Harishrao and Revanth Reddy : ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సుప్రీంలో విచారణ జరగడం ఖాయమని, ఆయన జైలుకు వెళ్లడం తప్పదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై విచారణ జరపాల్సిందేనని.. ఇటీవలే సుప్రీం తీర్పునిచ్చిందని ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్.. తెలంగాణలో ఏం చేయగలదని ప్రశ్నించారు. 24 గంటలు విద్యుత్ కావాలంటే బీఆర్ఎస్.. 3 గంటలే చాలనుకున్న వాళ్లు కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని సూచించారు.
Revanth Reddy Counters to Harishrao : త్వరలో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్తారన్న మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. కేంద్రం, రాష్ట్రంలో వాళ్ల ప్రభుత్వమే ఉందన్న ఆయన..ఇన్నాళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు త్వరలో జైలుకెళ్తారనే చర్చ జరుగుతోందని.. ప్రజల దృష్టిని మరల్చడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో తన పదేళ్ల హయాంలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిపై.. కొడంగల్ చౌరస్తా వద్ద చర్చకు సిద్ధమని మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు.