తెలంగాణ

telangana

Man Died After Wall Collapses

ETV Bharat / videos

Wall Collapse Video Viral : కూర్చున్న కొమ్మ నరికినట్టు.. గోడ కింద నిలబడి కూలగొట్టారు.. చివరకు - గోడ కూలీ వ్యక్తి మృతి

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 2:22 PM IST

Wall Collapse Video Viral  : చావు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికి తెలీదు. కాబట్టి ప్రజలు చేసే పని పట్ల శ్రద్ధతో పని చేయాలని అధికారులు ఈ ఘటనను ఉదాహరణగా తీసుకొని చెబున్నారు. పాత గోడను కూల్చే సమయంలో ప్రాణాలనే పోగొట్టుకున్నాడో వ్యక్తి. ఈ దుర్ఘటన హైదరాబాద్​ చందానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చందానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో పాపిరెడ్డి కాలనిలో రాజీవ్​ గృహ కల్ప సమీపంలో కూకట్​పల్లి చెందిన జయరావు(45) రోజుకూలీ పనిలో భాగంగా నిన్న పాత ఇంటిని గోడను కూల్చే పనికి వెళ్లారు. తనతో పాటు మరో వ్యక్తి ఇద్దరు కలిసి పాత గోడను కూల్చడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గోడ మీద పడింది. దీంతో జయరావుకి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే కొండాపూర్​ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details